Tuesday 15 December 2015

నాకు నేను గా...!!!!

                                                       నాకు నేను గా...!!!!
                    అది అమీర్పేట్ జంక్షన్ ఎప్పటి లాగానే రద్దీ గా ఉంది.అక్కడ ఎప్పుడు పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.కారణం మన రాష్ట్రం లో ఉన్న బీ.టెక్ కళాశాలలే.అలాంటి రోడ్ లో నడుస్తూ ఉన్నాడు మహేష్.
                 అతను నడుస్తున్న మాటే కానీ అతని మెదడు కి మనసు కి అనుసంధానమే లేదు చేతిలో ఒక ఫైల్ ఉంది.అంతలో వెనుక నుండి కార్ వచ్చి అతడిని డీ కొట్టింది అంతే  ఇంతవరకు బిజీ గా ఉన్న అందరు ఆ కార్ దగ్గరకు వచ్చారు అప్పటి వరకు చేస్తున్న పనులు వారు మర్చిపోయారు.ఇంతలో కార్ లో నుండి ఓ పెద్ద మనిషి బయటకు వచ్చి మహేష్ ను పక్కకు కూర్చోబెట్టాడు.ఇంతలో ట్రాఫిక్ పోలీస్ రావడం వారికీ ఇవ్వవలిసింది  ఇచ్చి పంపడం చకా చక జరిగిపోయాయి.మహేష్ ను చుస్తే బాగా అలసిపోయడని అర్ధం అయ్యింది ఆ కార్ యజమాని కి.అందరు వెళ్ళిపోయాక ఒక మంచినీళ్ళ బాటిల్ కొని మహేష్ దగ్గరకు వచ్చాడు ఆ వ్యక్తి.
              నీళ్ళు  తాగిన  మహేష్ కొంచెం తేరుకొని పైకి లేచాడు.తన ఎదురుగా ఉన్న వ్యక్తీ ని చూసి ఆశ్చర్యపోయాడు అతను ఎవరో కాదు ప్రముఖ రచయిత మరియు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన  సంతోష్ గారు."సారీ సార్ నేనే చూసుకోకుండా మీకు అడ్డం వచ్చాను"."ఇట్స్ ఓకే  ఇంతకి అంత పరధ్యానం గా ఎందుకు నడుస్తున్నావు కొంచెం చూసి నడవాలి గా అంటూ కొంచెం మందలింపు  గా అన్నాడు". ఏదో జాబ్ గురించి ఆలోచిస్తూ వస్తుంటే అంతలో ఇలా  జరిగిపోయంది సారీ సర్".ఓకే అలా హోటల్ కి వెళ్లి మాట్లాడుకుందాం అని చొరవగా మహేష్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు".మహేష్ కూడా కొంచెం మొహమాటం పడుతూనే వెళ్ళాడు.మహేష్ కి ఇడ్లి తనకి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు.
             "ఇప్పుడు చెప్పు మహేష్ జాబు కోసం అంతగా ఆలోచించాలా చెప్పు"."మరి దేని కోసం ఆలోచించాలి.జీవితం లో అందులోను మగవారికి ఇంతకన్నా పెద్ద లక్షం ఏముంటుంది చెప్పండి సర్.నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివి ఈ కలల ప్రపంచం లో కి అడుగు పెడితే కలలు తప్ప ఈ లోకం లో ఎం లేవు.చదువు పూర్తి ఐన తరువాత కోచింగ్ లు ఏంటి సర్ అర్ధం లేకుండా"."మరి అలా అనుకున్నప్పుడు కాంపస్ లో నే ట్రై చెయ్యల్సింది " ."అలాగే సర్ నేను ఒప్పుకుంటున్నాను ఒకటా,రెండా వందల సంఖ్య లో ఇంజనీరింగ్ కాలేజీ లు వేల సంఖ్య లో విద్యార్ధులు అంత మంది లో వారు రిక్రూట్మెంట్ చేసుకునేది గట్టి గా ముప్పైయ్ మంది నే మరి మిగతా వారి పరిస్థితి ఏంటి చెప్పండి ".
            ఇలా ఆసక్తికరంగా సాగుతున్న సంభాషణని మధ్య లో ఆపేస్తూ వచ్చాడు సర్వర్ వారు ఆర్డర్ చేసినవి తెచ్చి."సరే మహేష్ ముందు తిను తరువాత మాట్లాడదాము".మొదట కొంచెం మొహమాట పడుతూనే తిన్నా బాగా ఆకలి గా ఉందేమో త్వరగా తినేసాడు.ఈ లోపల సంతోష్ గారు కాఫీ తాగడం పూర్తి చేసారు.చెప్పు మహేష్ ఎక్కడ ఉన్నాం"."సర్ ఒకసారి అటు చూడండి" అంటూ చూపించాడు. ఓ రెండు వందల మంది వస్తు కనిపించారు వారందరూ యువకులే."ఏంటి మహేష్ ఎదయిన సినిమా రిలీజ్ ఆ ఈ రోజు"."అయ్యో సర్ అది ఓ కోచింగ్ సెంటర్ వారందరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు నాలాగా"."మరీ ఇంత మందా"."సర్ ఇది ఒక క్లాసు కి వెళ్ళిన వారు మాత్రమే ఈ విధంగా రోజు కి ఎన్ని క్లాసులూ ఎన్ని కోచింగ్ సెంటర్లు"."ఓ మై గాడ్ ఒక్క హైదరాబాద్ లో నే ఇంత మంది ఉంటే దేశం మొత్తం మీద ఇంకా ఎంత మంది ఉంటారు"."ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడానికి ఇదే పెద్ద కారణం ఏమంటారు సర్ "."ఆ నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది"."మీకు ఒక విషయం చెప్పమంటారా సర్ వీరిలో చాల మంది కి వారు చేస్తుంది నచ్చదు ఏదో పేరెంట్స్ బలవంతం మీద ఇంజనీరింగ్ చేసి ఉంటారు.ఒక విధంగా నిరుద్యోగాని కి పరోక్షంగా వారు కారణం అవుతున్నారు.వారి ఇష్టమైన రంగాన్ని వారు ఎంచుకుంటే ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించే వారు"."మరీ నీకు ఏమి అవ్వాలని ఇష్టం అంటే ఎలా సెటిల్ అవుదామని"."సర్ నాకు చిన్నప్పటి నుండి తెలుగు అంటే చల్ల ఇష్టం ఎప్పటి కైన గొప్ప రైటర్ అవ్వాలని ఉంది".
           "మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావ్?"."నేను మిమ్మల్ని ఒక ప్రశ్నఅడగనా సర్ మీరు ఎందుకు ఇంజనీరింగ్ ఎందుకు చేసారు?నాకు తెలుసు సర్ మీకు డాన్స్ అంటే ప్రాణం అని నేను మీలాగానే  పేరెంట్స్ కోసం చేశాను తప్ప నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు"."అంటే నా గురించి అన్ని తెలుసుకున్నావ్"."చెప్పానుగా సర్ మీ నొవెల్స్ చాల చదివాను అలానే మీ గురించి నెట్ లో సెర్చ్ చేసి మీ పర్సనల్ విషయాలు కుడా తెలుసుకున్నాను".
         "ఏంటో మహేష్ నేను నీకు ఎలాగైన ధైర్యం చెప్పలని అనుకుంటే నువ్వే నాకు చల్ల విషయాలు చెప్పావు"."నీకు ఇన్ని విషయాలలో క్లారిటీ ఉంది కదా మరి పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏంటి చెప్పు".తన లోని రచయిత మనసు అడగకుండా ఉండలేక పోయింది."ఇంకా కెరీర్ లో సెటిల్ అవ్వలేదు మీరు అప్పుడే పెళ్లి గురించి అడుగుతున్నారు"."ఎం లేదు మహేష్ నువ్వు పెళ్లి విషయం లో ఎలా అలోచిస్తావని తెలుసుకోవాలని ఉంది నీకు ఇష్టం లేకపోతె వద్దు చెప్పద్దు"."అయ్యో అలా ఎం లేదు సర్ నా విషయం లో డబ్బు సంపాదించ ని వాడికి ప్రేమించే అర్హత లేదు"."గుడ్ మహేష్ మరి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటావా లేక పెద్దవారు చుసిన సంభందమే చేసుకుంటావా".ఎంతో ఉత్సాహంగా అడిగాడు.
         "నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే మా అమ్మ గారి  లాంటి అమ్మాయిని చూసి చేసుకుంటాను లేదా మా నాన్నగారు సెలెక్ట్ చేసిన అమ్మయిని చేసుకుంటాను ఎందుకంటే మా నాన్నగారు సెలెక్ట్ చేసేది మా అమ్మ గారి లాంటి అమ్మాయి నే గా".
      "సో గుడ్ మహేష్ నాకు ఈ రోజు చాల హ్యాపీ గా ఉంది నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు"."నాక్కూడా సర్ మిమ్మల్ని ఇంత దగ్గరగా చుస్తాననుకోలేదు అలాంటిది ఈరోజు నాతో ఇంత సేపు ఇలా మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది థాంక్స్ సర్".అంటూ వెళ్ళాడని కి ఫైకి లేచాడు మహేష్."ఒక్క నిమిషం మహేష్ ఇది నా బిజినెస్ కార్డు రేపు ఒకసారి మా ఆఫీస్ కి రా నీను తప్పకుండా హెల్ప్ చేస్తాను"."థాంక్స్ సర్ నాకు అవకాశం ఇస్తున్నందుకు కాని నాకు వద్దు సర్ 'నాకు నేనుగా' సాధించాలని ఉంది సో సారీ సర్ బై".అంటూ వెళ్తూ ఒక్క నిమిషం వెనక్కి చూసి సర్ మీరు నాకు  అంత గా హెల్ప్ చేయాలనిపిస్తే మా గురించి అంటే 'నిరుద్యోగ భారతదేశం 'గురించి ఒక చిన్న రచన చేయండి సర్ చాలు". అని చెప్పి వెళ్ళిపోయాడు.'రాస్తాను మహేష్ నా తరువాత నవల దిని గురించే' అని మనసు లో అనుకోని వెళ్ళడానికి  ఫైకి లేచారు సంతోష్ గారు.
                                                                                                              srinath.p

No comments:

Post a Comment