Tuesday 12 January 2016

ఆత్మహత్య

                                                          ఆత్మహత్య
                  "హలో"."హా చెప్పు కిషోర్"."ఏంటి రా ఎక్కడున్నావ్ త్వరగా రా లేట్ అయిపోతుంది"."ఎం టెన్షన్ పడకు రా నేను మన రాకేష్ ని కూడా తీసుకోని బయలుదేరుతున్నాను మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్లే జరుగుతుంది"."సరే నేను కూడా వస్తున్నాను."అంటూ ఫోన్ పెట్టేశాడు.సరైన టైం కి వెళ్ళాలని నా బైక్ స్టార్ట్ చేశాను.అలా నా చివరి ప్రయాణం మొదలైంది.

                ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదా నా పేరు శ్రీరామ్.నాది అందమైన నగరం హైదరాబాద్.నాన్న గారు చిన్న ప్రభుత్వ ఉద్యోగి.అమ్మ గారు హోం మేకర్.ఇక నేను ఈ నిరుద్యోగ భారతదేశంలో ఒక నిరుద్యోగిని.ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేట లో ఉన్నాను.ముందు చెప్పాను గా నా ఫ్రెండ్స్ కిషోర్,రాకేశ్ లు కూడా నాలాగానే 'ఉద్యోగి' అని అనిపించుకోవాలని బాగా ట్రై చేస్తున్నారు.మేము అందరం చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్.బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎందుకు అన్నానంటే ఈ రోజు అందరం కలసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం.అవును మీరు చదివింది నిజమే ఇప్పుడు మేము వెళ్తున్నది చనిపోవడానికే.అవును ఈ ప్రపంచం లో అందరు పని చేసుకుంటున్నారు మేము ముగ్గురం తప్ప .అందుకే ఈ అందమైన నిర్ణయం తీసుకున్నాం.అసలు మేము మొత్తం నలుగురం ఫ్రెండ్స్ నాలుగోవాడు సోనార్ వాడికి మాకంటే తొందర ఎక్కువ అందుకే ముందే ఆత్మహత్య చేసుకున్నాడు కారణం టెన్త్(10th)లో మార్క్స్ తగ్గడం వలన.

              పది నిమిషాల తరువాత మేము ముగ్గురం కలుసుకున్నాం చివరిసారిగా .అందరం ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం కాని ఎవరు ఏమి మాట్లాడం లేదు.ఆ భయంకరమైన  నిశ్శబ్ధాన్ని చేదించడానికి ఎవరికీ దైర్యం రావడం లేదు.చివరికి నేనే ఆ పని చేయాల్సి వచ్చింది."ఏంటి అందరం ఇలా మౌనం గా ఉంటె ఎలా చెప్పండి ఎలా చచ్చిపోదమో". "వచ్చినవెంటనే చనిపోవడమేనా చివరి కోరికలు తీర్చుకోవద్దా".అంటూ తన అభిప్రాయం చెప్పాడు కిషోర్.సినిమాలు జనాల్ని అందరిని ప్రభావితం చేస్తాయి వాటికి ఎవరు అతీతులం కాదు.అవును కిషోర్ కి సినిమాలంటే పిచ్చి ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం. ఎప్పటికయినా డైరెక్టర్ అవ్వాలన్నది వాడి ఆశ ఈ రోజుల్లో డైరెక్టర్ అవ్వడం ఆశ కాదు అత్యాశేనని  నా అభిప్రాయం.

            "సరే చెప్పండి మీ కోరికలు" ."నాకు సినిమా చూడాలని ఉంది"వెంటనే చెప్పాడు కిషోర్."నాకు బావర్చి బిర్యానీ తినాలని ఉంది".చెప్పాడు రాకేష్."సరే ఇంతకు నువ్వు చెప్పు"."నాకు చివరిసారిగా గుడి కి వెళ్ళాలని ఉంది"."సరే మొదట నీ కోరిక  తో నే మొదలుపెడదాం".

            దర్శనం అయిన తరువాత నేను ప్రసాదం తీసుకోవడానికి కౌంటర్ దగ్గరకు వెళ్ళాను."ఏవండి మూడు పాకెట్స్ ఇవ్వండి అంటూ వంద నోటు ఇచ్చాను".తను ప్రసాదం ఎడమ చేతితో ఇస్తున్నాడు."అదేంటండి ప్రసాదం ఎడమ చేతితో ఇస్తున్నారు".అంటూ అడిగాను.తను సారీ సర్ అంటూ తన కుడి చెయ్యి చూపించాడు అక్కడ ఖాలీ షర్టు వేలాడుతుంది అంటే తనకి కుడి చెయ్యి లేదనమాట."అయ్యో సో సారీ అండి"అని చెప్పి ప్రసాదం తీసుకోని వచ్చాను.

          'నాకు మొదటి సారి మేము చేసేది తప్పనిపించింది'.ఆ తరువాత ముగ్గురం కలిసి సినిమా కి వెళ్ళాం.అవే కధలు కాకపొతే కొత్తవారు అంతే తేడా.తిరిగి వస్తుండగా ఒక ఐదు పదుల వయసున్న అతను చిన్ని చిన్ని బొమ్మలు అమ్ముతున్నాడు.తనకి ఒక కాలు లేకపోవడం 'కిషోర్' గమనించాడు.ఇప్పుడు తనకి అదే ఆలోచన మేము చేస్తున్నది కరెక్టేనా అని.ఇవేమీ గమనించని రాకేష్ మాత్రం ఏదో మాట్లాడుతున్నాడు కాని మా మనసులు అవి పట్టించుకోవడం లేదు.

           ఈ సారి మా ఇద్దరకి ఐన అనుభవం రాకేష్ కి ఎదురైంది ఒక అమ్మాయి రూపం లో...! అందరం బావర్చి లో బిర్యానీ తిని మా చివరి ప్రస్థానానికి బయలుదేరాం."హలో జరగండి హలో మిమ్మల్నే జరగండి".అంటూ అరుస్తున్నాడు రాకేష్.ఏమైందా అని చుస్తే సరిగ్గా మా వయసున్న అమ్మాయి వాడి బండి కి అడ్డం వస్తుంది వాడు ఎన్ని సార్లు హారన్ కొట్టిన చుసుకోవడంలేదు చేతిలో 'పిజ్జా'  బాక్స్ ఉంది.
ఇక లాభం లేదని రాకేష్ బండి పక్కకు తీసి తనతో మాట్లాడడానికి వెళ్ళాడు.

            "ఏంటి మీకు హారాన్ కొడుతున్న చుసుకోరా కొంచెం ఉంటే ఎం జరిగేదో తెలుసా".అని కొంచెం కోపం గానే అడిగాడు.కాని తను ఏమి మాట్లాడం లేదు.ఇక రాకేష్ సహనం కోల్పోయాడు."ఏంటి అండి మీకు ఏమైనా చేవుడా నేను ఇంట అరుస్తున్నా మాట్లాడం లేదు".ఇంతలో ఒక పెద్దమనిషి అక్కడకు వచ్చాడు."సారీ సర్ ఆ అమ్మాయి కి వినిపించదు ఇక్కడే పక్కనే ఉన్న పిజ్జా కార్నర్ లో పని చేస్తుంది.తనకు అమ్మ,నాన్న కూడా ఎవరు లేరు".
                 
          రాకేష్ ఏమి మాట్లాడలేదు అసలు ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు.సైలెంట్ గా బైక్ స్టార్ట్ చేసాడు.అలా ముగ్గురికి మూడు అనుభవాలు ఎదురయ్యాయి మా చివరి ప్రయాణం లో ఎవరు ఏమి మాట్లాడం లేదు.చివరికి మా సూసైడ్ స్పాట్ కి చేరుకున్నాం.అప్పుడు టైం ఎనిమిది కావొస్తుంది.కనుచూపుమేరలో మనుషులు ఎవరు లేరు.ఇక్కడే మా చిరకాల మిత్రుడు 'సోనార్' మమ్మల్ని వదిలి వెళ్ళింది.

         అందరి కి ఏదో చెప్పాలని ఉంది కాని ఎవరు మాట్లాడం లేదు నిశబ్ధం కన్నా భయంకరమైనది ఈ సృష్టి లోనే లేదు.అసలు ఎం చేస్తున్నామో అర్ధం కావడంలేదు.ఈ నిశ్శబ్ధాన్ని బ్రేక్ చేస్తూ మాట్లాడాడు కిషోర్ "ఏంటి రా భయం వేస్తుందా"."అవును రా "వెంటనే సమాధానం ఇచ్చాడు రాకేష్."ఇంతవరుకు వచ్చిన తరువాత భయం ఏంటి రా రండి అందరం కలసి కిందకు దూకుదాం".అంటూ ఆర్డర్ వేసాడు.
   
         ఇంక ఎవరము వాడికి సమాధానం చెప్పలేకపోయం.అనుకుంటాం కానీ 'ఆత్మహత్య' చేసుకోవడం చాలా కష్టం.ఇక ఎన్ని అనుకోని ఎం లాభం అందరం కలసి దుకబోతుండా  గా వినపడింది ఒక విచిత్రమైన శబ్దం.నేను ఎక్కడో ఇంతకు ముందు విన్నా ఆ గొంతు ని కాని ఎక్కడ విన్నానో గుర్తు రావడం లేదు."ఆగండి దూకొద్దు".అని అరుస్తున్నారు మనిషి మాత్రం కనపడటం లేదు.

        అప్పుడు కనపడింది ఒక వింత ఆకారం తెల్లని బట్టలు గాలిలోకి ఎగురుతున్నట్లు ఉంది.తనకి కాళ్ళు లేవు రెండు చేతులు గాలిలోకి ఉపుతున్నారు.అప్పుడు కనపడింది తన మొఖం అవును తను చిన్నప్పుడు చనిపోయిన మా స్నేహితుడు 'సోనార్'.

       ఆనందపడాలో,భయపడలో అసలు ఎం చేయాలో అర్ధం కాలేదు ఆ క్షణం.ఒక రెండు నిముషాలు తను మమ్మల్ని మేము తనని చుస్తూఉండిపోయం.చివరికి కిషోర్ దైర్యం చేసి మాట్లాడు."సోనార్ నువ్వు ఇక్కడ ఏంటి మమ్మల్ని భయపెట్టడానికి వచ్చావా".అంటూ కొంచెం భయంగానే అడిగాడు."లేదు మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను"."జోక్స్ వేయకు రా కొంచెం సేపట్లో మేము కూడా నీ లాగానే మారబోతున్నాం"."ఆ మారి ఎం చేస్తారు".బాణం లాగా దూసుకొచ్చింది వాడి ప్రశ్న.ఆ ప్రశ్న కు మా దగ్గర సమాధానమే లేదు.ఒక్క మాదగ్గర ఏంటి ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఎవరి దగ్గర ఉండదు సమాధానం.

          "అది సరే నువ్వేంటి ఇక్కడ ఈ స్వర్గం లోనో హ్యాపీ గా ఉంటావనుకుంటే ఇక్కడ ఇలా "అంటూ మధ్య లోనే ఆపేసాను నేను."రేయ్ శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నవారికి స్వర్గం లో కాదు కదా నరకం లో కి కుడా రానివ్వరు"."మరి ఎం చేస్తారు మనల్ని"."మనం ఎన్ని సంవత్సరాలు బతకాలో అన్ని సంవత్సరాలు ఇలా ఉండడమే."ఇది నరకం లో విధించే శిక్ష కన్నా పెద్దది కదా రా"."అవును రా".

         "ఏంటి ఎం చేద్దామని వచ్చారు".సోనార్ అడిగాడు."ఏంటి రా ఏమి తెలియనట్టు అడుగుతావు మేము కూడా నీ లాగానే.....!".అంటూ ఆపాను."మీరు మారరా ఎన్ని అవకాశాలు వచ్చాయి రా మీకు ఒక్కొకరికి ఒక్కొక అనుభవం ఐన మీరు వాటి గురించి ఆలోచించరు అలంటి అవకాసం నాకు వచ్చుంటే నేను బ్రతికేవాడినేమో ".

         "ఆత్మహత్య అంటే ఒక చిన్న సమస్యకు మీరు విదించుకునే శాశ్వత శిక్ష .ఒక్కసారి మీ గురించి కలలు కంటున్న అమ్మ,నాన్న ల గురించి ఆలోచించండి మీకు కనిపించిన ముగ్గురు వ్యక్తులతో పోల్చుకుంటే మీవి అసలు సమస్యలా చెప్పండి.ఈ ప్రపంచం లో డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసా"."ఆ తెలుసు".అంటూ బదులిచ్చాను."మీకు తెలిస్తే ఇంత దూరం రారు ఎన్నో పనులు ఉన్నాయ్ రా చేయడానికి కాని చెయ్యాలంటే 'అహం'(ego)అడ్డొస్తుంది చావానయినా చస్తారు గాని అహాన్ని మాత్రం వదలరు ఒక్క మీరేంటి ఈ లోకం లో ఉన్న అందరు అంతే ఒక్క క్షణం ఆ అహాన్ని పక్కన పెడితే 70% ఆత్మహత్యలు తగ్గుతాయి రా".అంటూ మా వైపు చూశాడు.

         "ఏంటి బాగా బోర్ గా ఉందా?"."అదేమ లేదు రా నేను ఒక ప్రశ్న అడుగుతాను రా సమాధానం చెప్పు ఇవన్ని చెప్పడానికి బాగుంటాయ్ రా చేయడానికి చాల కష్టం అవునా కాదా"."అవును రా కాని ఒకసారి చేసి చుడండి ఒక్క రూపాయి సంపాదించి అమ్మనానల్ని చూసుకుంటే ఉన్న ఆనందం ముందు ఈ సమస్యలు సమాధానాలు కనిపిస్తాయి సరే నేను వెళ్ళాలి ఇప్పటికే చాల టైం ఐంది". అని సోనార్ అదృశ్యం అయిపోయాడు.

            మేము మా కొత్త జీవితాలు ప్రారంబించడానికి బయలుదేరాం.ఐనా ఆత్మహత్య చేసుకున్నవాడు మమ్మల్ని ఆత్మహత్య చేసుకోవద్దు అంటూ ఇంత సేపు చెప్పాడంటే 'ఆత్మహత్య' అంత భయంకరం గా ఉంటుందా.............!
           

                                                                                                        శ్రీనాథ్.p