Friday 25 December 2015

ఏం కధ రాద్దాం...?

                                                          ఏం కధ రాద్దాం...?
                 ఈ రోజు ఎలాగైనా కధ రాద్దామని కూర్చున్నా రాయాలని ఆలోచన తప్ప ఏమి రాయాలో అసలు అర్ధం అవట్లేదు.పేజిలకు పేజి లు చింపుతున్నానే  కాని ఒక్క ఆలోచన కూడా రావట్లేదు.ఇలా కష్టం అని నా ఫ్రెండ్ కి కాల్ చేశా."హాయ్ రా "."హాయ్"."నిన్ను ఒకసారి కలవాలి రా" అని డైరెక్ట్ గా విషయంలోకి వచ్చా."ఓకే మన స్పాట్ కి కరెక్ట్ గా ఉదయం  ఏడు గంటలకి రా".అని వాడు నాకన్నా ముందర ఫోన్ కట్ చేసాడు. సరే ఎలాగు  సాయంత్రం వాడి ని కలుస్తున్నాను కదా అని 'కధ' గురించి మర్చిపోయి మిగతా పనుల్లో పడ్డాను.
           
                 కరెక్ట్ గా టైం కి వెళ్ళాలని ఒక గంట ముందే అక్కడకు వెళ్ళాను.ఇంతకీ ఆ స్పాట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇద్దరికీ సమాన దూరం లో ఉన్న 'కేబీఆర్' పార్క్.చలి కాలం కావడం తో ఇంకా నగరం దుప్పటి ముసుగు లోనే ఉంది.పార్క్ మొత్తం ఖాళీగానే ఉంది.నేను ఇన్ని గమనిస్తున్న ఎక్కడో నా మనసు 'కధ' గురించే ఆలోచిస్తుంది.ఆ ఆలోచనే నాకు నిద్ర పట్టనియకుండా చేస్తుంది.నా ఫ్రెండ్ వచ్చేలోపల అలా ఒక రౌండ్ నడుద్దామని ఉన్న చోటు నుండి లేచా.అలా నడుస్తూ ఉండగా ఓ ఇద్దరు పిల్లలు సినిమా పోస్టర్లు అంటిస్తూ ఉన్నారు ఒకరు మైదా పూస్తూ ఉంటె మరొకరు అంటిస్తున్నారు.

                    ఎందుకో నా చూపు ఆ పోస్టర్ మీదకు వెళ్ళింది అది ఒక ప్రముఖ హీరో సినిమా హారర్ జోనర్ లో వస్తుంది.ఇంతలో నా మెదడు 'హారర్ ' బేస్ గా ఒక  'కధ' రాయచ్చుగా అని నా మనసు  కి సంకేతాలు పంపింది.ఇక ఆ ఆలోచనని నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది.'ఎప్పుడు అవే కధ లు మొదటి నుండి ఏవో దయ్యాలు ఉన్నాయ్ అని సృష్టించి చివరకు అవి కేవలం హీరో కల్పితమని చెప్పే కధ ల తో ప్రజలు విసిగి పోయారు దాంతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది.

              అలా నడుస్తూ ఉండగా దారి లో ఫ్రెండ్ ఎదురు వచ్చాడు."హే హాయ్ రా" ఏంటి ఇంత త్వరగా వచ్చావ్".వస్తూనే నాకు ప్రశ్న సంధించాడు."ఎం లేదు రా "."సరే చెప్పు ఏంటి రామన్నావు"."పదా అలా బెంచ్ మీద కూర్చొని మాట్లాడుదాం " ."ఐతే పెద్ద విషయమే".అంటూ నవ్వాడు.ఆ ఇప్పుడు చెప్పు "ఏంటి విషయం" ."ఎం లేదు రా నేను ఒక చిన్న కధ రాద్దామనుకుంటున్నాను"."నేను దాన్ని పబ్లిష్ చేయాలా".అంటూ మల్లి నవ్వాడు."చెప్పేది వినురా ఎం రాయాలో అర్ధం కావడం లేదు అంటే థీమ్ దొరకట్లేదు నువ్వు ఏమైనా మంచి సలహా ఇస్తావేమోనని రమ్మన్నాను"."ఇంత చిన్న విషయమా అదేముంది రా మా గురించి రాయ్ అంటే మా సాఫ్ట్వేర్(software) ఫీల్డ్  గురించి రాసేయ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కి ఎంత బూమ్ ఉందొ నీ కధ కు అంతే బూమ్ ఉంటుంది".' ఇంతకన్నా వీడు ఎం చెప్పడు అనిపించి కధ విషయం తరువాత చూద్దాం అని వాడితో ముచ్చట్లు మొదలుపెట్టాను'."అరేయ్ మాటల్లో పడి టైం మర్చిపోయాను అసలే మా టీం లీడ్ చాలా స్ట్రిక్ట్ (strict)".'అని వాడు త్వరగా లేచి వెళ్ళిపోయాడు".

                  నేనూ ఇంటికి వెళ్ళుతూ తను చెప్పింది ఆలోచిస్తున్నాను.'సాఫ్ట్వేర్(software) ఇప్పుడు వారికున్న గౌరవం రాజకీయనాయకులకు కుడా లేదు.కాని వారు పడుతున్న కష్టాలు వాళ్ళకే తెలుసు.ప్రపంచం లో నెలలో చివరి రోజు కోసం ఎదురు చూసేవారు  ఉన్నారంటే వారు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజినీరే.వారి కున్న టెన్సన్స్ వారివి.నాకు ఆ థీమ్ కూడా నచ్చలేదు' ఇలా అలొచిస్తూ ఇంటికి చేరాను.

                 నేను ఇంటికి వెళ్ళే సరికి మా ఆవిడ కాఫీ కప్పు తో ఎదురు వచ్చింది.నేను కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాను ఇంతలో ఇంట్లో నుండి పిల్లవాడి ఏడుపు వినిపించింది."కవిత ఎవరు ఆ పిల్లవాడు"."మన పక్కింటి వాళ్ళ బాబు అండి"."వాళ్ళు ఇంట్లో లేరా"."లేరు అండి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లె రోజు బేబీ కేర్ సెంటర్ లో వదిలిపెడతారు.ఈ రోజు ఎందుకో ఆ బేబీ సెంటర్ కి సెలవు అంట అందుకే నాకు అప్పగించి వెళ్లారు".అంటూ అంత వివరించి చెప్పింది.'నిజంగా వారు ఎంత కష్టపడుతున్నారో మరి ఈ రోజుల్లో బ్రతకాలంటే భార్య భర్త లు ఇద్దరు ఉద్యోగం చేయాల్సిందే'
 
               నేను ఆ విషయం వదిలేసి నా కధ గురించి ఆలోచించడం మొదలుపెట్టా."డాడీ రెండు రొజుల నుండి చూస్తున్న ఏంటి దేని గురించో ఆలోచిస్తున్నావు"."ఎం లేదురా ఓ చిన్న కధ రాద్దామని దాని గురించి ఆలోచిస్తున్నా"."ఏంటి డాడీ దాని గురించి అంత ఆలోచించాలా చెప్పు"."ఏంటి రా కధ రాయడం అంత సులభమా"."మరి కాదా డాడీ"."సారీ చెప్పు రా ఓ మంచి థీమ్ చెప్పు రాస్తాను"."ఓ మంచి లవ్ స్టొరీ రాయి డాడీ మా యువత అంతా మీకు అభిమానులు అవుతారు".'అని చెప్పి వాడు కాలేజీ కి వెళ్ళాడు.
 
            నా మనసు అప్పుడే లవ్ స్టొరీ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది.'ప్రపంచం లో లవ్ లో పడని వారు అసలు ఉండరు.ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది సహజం.వయసు తో సంబంధం లేకుండా చేసే పని ఎదైనా ఉంది అంటే అది లవ్ చేయడమే.కాని ఎంతమంది ప్రేమికులు పెళ్లి వరకు వెళుతున్నారు.పెళ్లి వరకు వెళ్ళిన వారు ఎంత కాలం కలిసి ఉంటున్నారు?.ప్రేమలో సక్సెస్ పర్సెంట్ కన్నా ఫెయిల్యూర్ పర్సెంటే ఎక్కువ.లవ్,జీవితం రెండూ వేరువేరు.లవ్ లోను జీవితం లోను సక్సెస్ అయ్యేవారు చాల తక్కువ.లవ్ అనే పదానికి అర్ధం వారి వారి మనసును బట్టి ఉంటుంది.లవ్ కి ఎవరి అర్దాలు వారివి అందరు ఒకేలా రిసివ్ చేసుకోరు కదా.'అందుకనే లవ్ స్టొరీ కుడా రాయాలనిపించడం లేదు.

          రాయాలి ఏదో ఒక కధ రాయాలి కనీసం ఎ కధ రాయలేకపోవడం గురించి అయినా రాయాలి.చూడాలి కనీసం దాని గురించి అయినా రాస్తానో లేదో.

                                                                                                        శ్రీనాథ్.p

No comments:

Post a Comment