Tuesday 15 December 2015

Minus*Minus=Plus

                                                  మైనస్ *మైనస్ =ప్లస్
               టేబుల్ పైన ఉత్తరం ఫ్యాన్ గాలి కి రెపరెపలాడుతుంది దానిని చదివిన రఘునందన్ మనసు మాత్రం బాధ తో నిండిపోయింది కారణం ఆ ఉత్తరం రాసింది స్వయానా తన కన్నా కూతురే .క్రమక్రమంగా రఘునందన్ మనసు గతం లో కి వెళ్ళింది.
             డాడీ నాకు అర్జెంటు  గా పదివేలు కావాలి అని ఫోన్ పెట్టేశాడు ధీరజ్.తను ఫోన్ పెట్టేసిన పది నిమిషాలకి "మీ ఎకౌంటు లో డబ్బు క్రెడిట్ చేయబడింది" అని మెసేజ్ వచ్చింది ధీరజ్ కి.ఈ రోజుల్లో ప్రజలు బ్యాంకు ల కు  వెళ్ళడం మానేశారు ఇదేనేమో  డిజిటల్ ఇండియా అంటే.    
            ఇప్పటికే అర్ధం అయి  ఉంటుంది రఘునందన్ గారాల పుత్రుడు ధీరజ్ అతడంటే రఘునందన్ కి పంచ ప్రాణాలు.తను అడగడమే ఆలస్యం కొన్ని నిమిషాలలో తన ముందు ఉంటుంది.రఘునందన్ బ్యాంకు లో మేనేజర్ వృత్తి రిత్యా ఒంగోలు లో స్తిరపడ్డారు ధీరజ్ బీ.టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు పేరున్న పెద్ద కాలేజీ లో.కూతురు ఒంగోలు లో నే డిగ్రీ చదువుతుంది అదేంటి కొడుకు బీ.టెక్,కూతురు డిగ్రీ అన్న సందేహం వచ్చిందా అంటే మీకు ఇంకా పెళ్లి అవలేదు పెళ్లి అయి మీకు ఇలా ఒక అబ్బాయి,అమ్మాయి ఉంటె ఈ సందేహం రాదు    ఎందుకో కొడుకంటే అంత ప్రేమ తమ పేరు నిలబెడతాడని  నమ్మకం కాబోలు.
              ఇంతకీ ధీరజ్ డబ్బులు అడిగింది తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడానికి కారణం తను ప్రేమ లో ఉన్నాడు ఆ వయసు లో పార్టీ ఇవ్వడానికి అంత కన్నా గొప్ప కారణం ఉండదు.ధీరజ్ చిన్నప్పటి నుండి దేనికి లోటు లేకుండా పెరిగాడు కానీ అతడి చెల్లి మాత్రం తనకి పూర్తీ విరుద్దం చాల నెమ్మది ఓర్పు,సహనం లో ఆ భూమాత ను ఏమాత్రం మించిపోదు రోజు కాలేజీ కి వెళ్ళడం,ఇంటికి వచ్చి ఏదైనా పని ఉంటే చూసుకొని నిద్రకు ఉపక్రమించడం అదే తన దినచర్య.తన కన్నా అన్నయ్య నే బాగా చూసుకుంటారని దివ్య కు తెలుసు  తల్లిదండ్రులని కూతురు ప్రేమించినంతగా కొడుకు ప్రేమించడు అదే ఆడదాని లో ని గొప్పదనం.
             ఆ రోజు కాలేజీ లో ఫంక్షన్ కాలేజీ తరుపున ధీరజ్ తల్లిదండ్రులకు ఆహ్వానం వెళ్ళింది.కాని వారిని రావద్దని  కరాఖండిగా చెప్పాడు ధీరజ్ వారు వస్తే తన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని భయం కాని అమ్మయిల విషయంలో అలా కాదు తల్లిదండ్రుల ఆర్దిక పరిస్థితి తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించడం లో కొడుకు కన్నా కూతురే ఫస్ట్ అండ్ బెస్ట్.
             రేయ్ ధీరజ్ అంజలి ఇటే వస్తుంది రా అవును వారిద్దరూ ప్రేమ లో ఉన్నారు.తనని కలవడానికి  వస్తున్నపుడు ఎవరో తనని ఏడిపిస్తూ తన వెనకాలే వచ్చాడు. ఇది గమనించిన ధీరజ్ కోపం  తో వాడిని కొట్టాడు ఇక ఆ తరువాత వాళ్ళ గ్యాంగ్ వీళ్ళని కొట్టడం,వీరు వాళ్ళని కొట్టడం చక చక జరిగిపోయాయి చివరికి ఆ గొడవ పోలీస్ ల వరకు వెళ్ళింది.ఈ గొడవ నుండి ధీరజ్ ని విడిపించడం కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది కాని ధీరజ్ ని ఒక్క మాట కూడా అడగలేదు కారణం అతడి మీద నమ్మకం. ఇలా రోజులు గడుస్తూ ఉండగా దివ్య కి క్యాంపస్ లో నే ఉద్యోగం వచ్చింది కాని ధీరజ్ కి ఇంకా నాలుగు సబ్జెక్ట్స్ లు ఉండిపోయాయి. రఘునందన్ కి ఏమి మాట్లాడాలో అర్ధం కావడం లేదు తను గట్టి గ అడిగితే ఏమనుకుంటాడో అన్న సందేహం తో ఏమి అనలేక పోయాడు.ఏమి జరిగిందని ఆ రోజు పోలీస్ స్టేషన్ లో అడిగి ఉంటే కధ వెరేలాగ ఉండేదేమో.తల్లిదండ్రుల ని చూసి పిల్లలు భయపడే  రోజులు పోయి పిల్లలకు భయపడే రోజులు వచ్చి చాల కాలమే అయింది.
             రఘునందన్ కి రోజులు చాల భారంగా వెళ్లిపోతున్నాయి. ఎదిగొచ్చిన కొడుకు ఇంట్లో కలిగా ఉంటె ఏ తండ్రికి మాత్రం భాద ఉండదు చెప్పండి.ఇంతలో తన కూతురు వచ్చి దాడి ఇదిగో న ఫస్ట్ శాలరీ అని వచ్చిన మొత్తాని తన చేతిలో పెట్టింది.తల ఎత్తి కూతురి కళ్ళలోకి చూడాలంటే చాల ఇబ్బంది గా ఉంది రఘునందన్ కి దివ్య మాత్రం ఇవేమీ గమనించకుండా వెళ్లిపోయింది.తను ఇచ్చిన డబ్బులను అలా చూస్తూ ఉండిపోయడు కనీసం తనకి కంగ్రాట్స్ కుడా చెప్పకుండా మౌనం గా ఎందుకున్నవని మనసాక్షి ప్రశ్నిస్తుంది.
           ఇంతలో ఏమండి  మని అమ్మయికి మంచి సంబంధం వచ్చింది అని ఎంతో ఆనందం తో చెప్పింది.తనకి నచ్చడం తో నిశ్చితార్దం,పెళ్లి వెంటవెంటనే జరిగిపోయాయి.దివ్య అత్తారింటి కి వెళ్ళేటప్పుడు రఘునందన్ కి కొంచెం కూడా భాద కలగలేదు కూతురు వెక్కివెక్కి ఏడుస్తుంటే తన కంటి లో నుండి ఒక బొట్టు కన్నీరు కూడా బయటకు రాలేదు అందుకే కాబోలు కన్నీళ్ళకు విలువ ఎక్కువని అంటారు. రఘునందన్ కి కూతురు విషయం లో అంతా బాగా నే ఉన్న కొడుకు విషయం లో చాల కంగారు పడుతున్నాడు.కొడుకు సెటిల్ అయితేనే కదా  తండ్రికి గౌరవం.
          ఓ రోజు సాయంత్రం  రఘునందన్ ఇంటికి రాగానే మీకేదో ఉత్తరం వచ్చిందని తన చేతిలో పెట్టి వెళ్లిపోయింది అతడి బార్య .ఫ్రెష్ అయ్యి వచ్చి చదువుదాం  అనుకోని పక్కన పెట్టబోతూ గ్రహించాడు అది తన కూతురు రాసింది అని కొంచెం టెన్షన్ తోనే చదవసాగాడు.
 ప్రియమైన తండ్రి గారికి,
నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారో నాకు తెలుసు ఇంకా అన్నయ్య సెటిల్ అవ్వలేదని భాదపడుతుంటారు.ఎందుకు నాన్న ఆడపిల్లలంటే ఈ సమాజానికి అంట చులకనా భావం ఆడపిల్లల  కంటే మగవారు ఎందులో ఎక్కువ అమ్మాయి పుట్టగానే మైనస్ అని అబ్బాయి పుట్టగానే ప్లస్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు.అసలు అమ్మయిని  మైనస్ తో అబ్బాయిని ప్లస్ తో ఎందుకు పోలుస్తారో తెలుసా డాడ్ అమ్మయికి పెళ్లి ఐతే తమ ఇంట్లో నుండి ఒకరు వెళ్ళిపోతారు అదే అబ్బాయి కి పెళ్లి ఐతే వారి ఇంట్లోకి ఒక కొత్తవారు  వస్తారు కనుక అమ్మయిని మైనస్ అని అబ్బాయిని ప్లస్ అని అంటారు.మీరు చేస్తున్న తప్పే అందరు చేస్తుంటారు తల్లిదండ్రులని అర్ధం చేసుకోవడం లో కూతురు తరువాతే నాన్న ఎవరైనా.నేను ఏమైనా  తప్పుగా  మాట్లాడి ఉంటే క్షమించండి.ఇంతకీ నేను ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నాను అంటే మీ అల్లుడు గారు అన్నయ్య కి ఓ ఉద్ద్యోగం చూసారు.మీరు అక్కడ భాద పడుతూ ఉంటే ఇక్కడ నేను ఎలా సుఖం గా ఉంటాను నాన్న.నేను ఎన్ని అనుకున్న మీరు నా తండ్రి వాడు నా అన్నయ్య నా పుట్టినిల్లు తరువాతే నాన్న నాకు ఎవరైన.అన్నయ్యను పంపిస్తారని ఆసిస్తూ ......ఇప్పటికి ఎప్పటికి
                                                                                          మీ కూతురు,
                                                                                             దివ్య.
                ఈ ఉత్తరం చదివిని తరువాత రఘునందన్ కంటి నిండా నీరు అది తన కూతురి విషయం లో చేసిన తప్పు వలన వచ్చినవో లేక తన కొడుక్కి ఉద్యోగం వస్తుందన్న ఆనందం లో వచ్చిన ఆనంద బాష్పలో ఆ తండ్రి మనసు కె తెలియాలి.

                                                                                               శ్రీనాథ్.p

2 comments: